నిర్ఘుండి కల్పం:- వావిలితో వంద సంవత్సరాలు ఆరొగ్యంగా జీవించగలరు. వావిలితో కాయ కల్ప చికిత్స: ఈ చెట్టు ని మందులాగా చేసి తీసుకోవడం వల్ల , శరీర పుస్టిని, కాంతిని, శాంతిని ప్రసాదిస్తుంది, సాక్చాత్ దేవ స్వరూపిణిగా వర్ణింప బడింది. *దీని వేరుని పుస్యమీ నక్చత్ర్యం ఆదివారం నాడు కావలిసనంత వేరును చెట్టుకు హాని కాకుండా కొంత వరకూ తిసుకొచ్చి, ఈ వేరు ను దంఛి పొడి చేసి ఇందులో స్వచ్చమైన ఆవు నెయ్యి, స్వచ్చమైన తేనె, క్చీరాలతో కలిపి ఒక పాత మాగిన కుండలో వేసి బందించి, ఈ కుండను దాన్యపు రాసిలో ఈ కుండ మునిగే వరకూ దాన్యం వేసి ఒక నెల రోజులు మందును మగ్గనియ్యాలి, ఇలా చేసి పుస్యమి నక్చ్యత్రం నాడు వెలిగి తీసి నెల రోజులు ఈ మందు వాడితే దిర్గజీవనం, దీర్గకాలిక యవ్వనం ప్రాప్తిస్తుంది, ఈ పొడి పావు చెంచా ఉదయం మరియు రాత్రి ఆవు పాలతో తీసుకోవాలి. * ఈ మందును పావుచెంచా పరిమానం ఉదయం మరియు రాత్రి మెకపాలతొ ( 50 మిల్లీ) కొత్త గోర్లు, కొత్త దంతాలు, కొత్త కేశాలు వస్తాయి అని గ్రంధాలలో పెద్దలు పొందుపరిచారు. * దీని చూర్నాన్ని నిరంతరం వాడడం వల్ల ఇది అగ్నిబాధనుండి తప్పిస్తుంది అన్ని రకాల జీర్న సమస్యలను శరిర రోగాలను నిర్మూలించి శరీరాన్ని కాయాకల్పం అయ్యేలా చేస్తుంది. * దీని వేరును నువ్వుల నూనెతో లోపలికి తీసుకొంటే ఒక నెలలో 18 రకాల కుస్టులను తగ్గిస్తుంది, ( మెతాదు పావు స్పూన్ ఉదయం 1 చెంచా నువ్వుల నూనె, ఇలాగే రాత్రి కూడా బోజనం ముందు తీసుకోవాలి. * దీనిని ఒక నెలరోజులు ఆవు నెయితో తిసుకొంటే శరీరం తేలికగా శక్తివంతంగా వుండును. * ఈ చెట్టు వేరు బెరడును పుస్యమీ నక్చ్యత్రం ఉండగా ప్రొద్దున్న ఒలిచి, దీనిని ఎండించి చుర్నం చేయాలి, దీన్ని మేక మూత్రంలో నూరి ఒంటికి పట్టిస్తే దీర్గజీవనం కలిగి గొప్ప శక్తి కలుగును. పై విధంగా ఒక నెల రోజులు చేయాలి. * వావిలి వేరు త్రిఫల చుర్నం , బొడతరం, వేప , తిప్పతీగ, వీటిని సమభాగాలుగా స్వీకరించి 2 చెంచాల చొప్పున తిసుకొని ఇందులో కొద్దిగా తేనె నెయ్యి కలిపి రోజూ తిసుకోవాలి, ఇలా చేస్తె మెండి వ్యాధులు పొతాయి, ముసలితనాన్ని , దీర్గకాలిక జీవనం ప్రసాదిస్తుంది, ఈ వేరును బెల్లంతో కలిపి పాకం చేసి వాడితే విరేచనకారిలాగా పనిచెయును, క్రిమినాశిని లాగా పనిచెయును, క్చయ, రాజక్చయ, వండి మెండి రోగాలను కూడా నిర్మూలించి ఆరొగ్యంగా వుండేలా చేయును. * ఈ వేరుని నీడలో ఆరించి పొడి చేసినది పావు చెంచా , గోమూత్రం 30 మిల్లీ తో తిసుకొంటే అన్ని రోగాలు పొవును. * 18 భాగాలు ఈ వేరు చూర్నం 16 భాగాలు తేనె, 12 భాగాలు నేయి అన్నీ కలిపి ఒక గాజు పాత్రలో వేసి పైన మూత మూసి సీలు వేసి, దాన్య రాశిలో ఒక నెల రోజులుంచి దానిని పూజించి మీకు ఇస్టమైన దేవున్ని ప్రార్దించి, ఈ మందును సేవిస్తే సుందరువంతులగుతారు అని చెప్పబడింది, ద్రుడమైన శరీరం, దీర్గజీవనం, ముసలితనం లేకపొవుట, వెంట్రుకలు నల్లబడుట మెదలైన అనేక ఫలితాలు కల్గుతాయని స్ల్తోకాలలో చెప్పబడినది. మెతాదు: అర్దచెంచా నుంచి ఒక చెంచా వరకూ తీసుకోవచ్చును ఉదయం మరియు రాత్రి. * వీర్యవ్రుద్దికరమని, మానసిక వికారాలుండవని చెప్పబడింది * ఒక నెలరోజులు ఈ మందును గోమూత్రంతో వాడితే గాలిమేఘాలను తరిమినట్లు గోగాలను చెల్లా చెదురు చేస్తుంది * దీనిని ఆవునెయ్యితో కలిపి సేవిస్తే నల్లని వారు సైతం కాంతి వంతమైన శరీరాన్ని పొందేలా చేయగలదని గ్రంధాలు చెప్తున్నాయి. * ఈ వేరుని ఆవు పాలతో కలిపి తిసుకొంటే ఒక వారంలో మధరస్వరం వస్తుంది. * చల్లని నీటితో తీసుకొంటే బల వీర్యాలు కలుగుతాయి అలాగే తేజస్సు కూడా కలుగును.. ఇందులో నల్లవావిలి చాలా శక్తి వంతమైనది హిమాలయాల్లో ఋసులు, మునులు, మహార్సిలు ఈ చెట్టుతో యేగాలు తరచూ చేసుకొని వాడుతూ వుంటారు అని మా గురువుగారు చెప్పారు. అక్కడ నల్ల వావిలి చెట్ట్లు దొరకడం వల్ల కాయ కల్ప చికిత్సలు చేసుకిని వాడగలుగుతున్నారు.
No comments:
Post a Comment